close
Published : 16/04/2021 08:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొత్త అనుభూతిని పంచే... ‘ఇష్క్‌’

రోజు ఆ అమ్మాయి పుట్టినరోజు. రాత్రి కారులో ఆ అమ్మాయి... ఓ అబ్బాయి. ఆ కారేమో బీచ్‌ రోడ్డులో! మరి తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ‘ఇష్క్‌’ చూడాల్సిందే. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కథానాయిక. యస్‌.యస్‌.రాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎన్వీ ప్రసాద్‌, పారస్‌ జైన్‌, వాకాడ అంజన్‌కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్‌.బి.చౌదరి సమర్పకులు. చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ని కథానాయకుడు సాయి తేజ్‌ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. కథానాయకుడు తేజ సజ్జా మాట్లాడుతూ ‘‘ఇదొక కొత్త రకం కథ. ‘జాంబీరెడ్డి’ తర్వాత నేను చేసిన సినిమా ఇది. ఆద్యంతం ఉత్కంఠని రేకెత్తిస్తుంది. కొంత విరామం తర్వాత మెగా సూపర్‌ గుడ్‌ సంస్థ నాతో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఇదే పేరుతో నితిన్‌ సినిమా చేశారు. మీ సినిమా పేరు వినియోగిస్తున్నాం అనగానే నితిన్‌ సరే అనడంతోపాటు, ఇందులోని ‘ఆనందం...’ పాటని కూడా విడుదల చేశార’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఛాయాగ్రాహకుడు సమీర్‌రెడ్డి వల్లే నాకు ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాని 29 రోజుల్లో ఇంత నాణ్యంగా పూర్తి చేయడానికి కారణం నిర్మాతలు, ఛాయాగ్రాహకుడు శ్యామ్‌ కె.నాయుడు. తేజ, ప్రియా, తమిళ నటుడు రవీందర్‌తోపాటు చిత్రబృందం అంతా చక్కటి సహకారం అందించింది. మహతి మంచి సంగీతం అందించార’’న్నారు. ఈ కార్యక్రమంలో వాకాడ అప్పారావు, జెమినీ కిరణ్‌, బెక్కం వేణుగోపాల్‌, మహతి స్వరసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని