ఒకే ఒక్క పాత్రతో...
close
Updated : 17/04/2021 08:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకే ఒక్క పాత్రతో...

కథానాయిక హన్సిక ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించనున్నారు. ‘105 మినిట్స్‌’ పేరుతో... ఒకే ఒక్క పాత్రతో, ఒకే ఒక్క షాట్‌తో రూపొందనున్న చిత్రమిది. రాజు దుస్సా దర్శకత్వం వహించనున్నారు. రుద్రాన్ష్‌ సెల్యులాయిడ్‌ పతాకంపై బొమ్మక్‌ శివ నిర్మించనున్న ఈ చిత్రంలో హన్సిక ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాలు తెలిపాయి. ‘‘భారతీయ చిత్ర పరిశ్రమలో ఇదివరకెప్పుడూ ఈ తరహా ప్రయత్నం చేయలేదు. ఒకే ఒక్క పాత్రతో, ఒక్క షాట్‌లో ఎడిటింగ్‌ అవసరం లేకుండా ఈ సినిమాని తెరకెక్కించనున్నాం. ఇలాంటి చిత్రాన్ని మా సంస్థలో నిర్మిస్తుండడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత బొమ్మక్‌ శివ. ‘‘ఈ సినిమా నా కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది’’ అన్నారు హన్సిక. ‘‘ఈ సినిమాని చిత్రీకరించడం నాకొక పెద్ద సవాల్‌’’ అన్నారు ఛాయాగ్రాహకుడు దుర్గా కిషోర్‌.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని