ఇష్క్‌తో అనసూయగా అలరిస్తా
close
Updated : 18/04/2021 08:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇష్క్‌తో అనసూయగా అలరిస్తా

చేసే ప్రతి పాత్ర... సినిమా సెట్‌లో గడిపే ప్రతి రోజూ ఓ కొత్త అనుభవాన్ని, అనుభూతిని పంచుతుందని చెబుతోంది కథానాయిక ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ‘‘ఫలితాలతో సంబంధం లేకుండా ఇప్పటివరకు నేను చేసిన ప్రతి పాత్రా మనసుకు తృప్తినిచ్చింది. ఇక ‘ఇష్క్‌’లో చేసిన అనసూయ పాత్రయితే మరింత నాటకీయతతో కూడుకుని ఉంటుంది. ఆ పాత్ర ఆత్మని మనసులో పెట్టుకుని నా శైలిలో నటించా. దర్శకుడు ఆ స్వేచ్ఛ ఇచ్చార’’ని చెప్పుకొచ్చింది ప్రియా. కన్నుగీటిన వీడియోతో సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుందీ కుర్ర భామ. అనువాద చిత్రం ‘లవర్స్‌ డే’తో పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకొంటోంది. ‘చెక్‌’లో నితిన్‌తో కలిసి ఆడిపాడింది. ఈ నెల 23న వస్తున్న ‘ఇష్క్‌’లో తేజ సజ్జాకి జోడీగా నటించింది. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది.
* ‘‘అనసూయ అనే ఒక పల్లెటూరి అమ్మాయిగా నేను కనిపిస్తా. ఆత్మ గౌరవం మెండుగా ఉన్న కాలేజీ అమ్మాయి పాత్ర అది. ‘చెక్‌’లో నా పాత్ర తెరపై కనిపించేది తక్కువ సమయమే, ఇందులో పూర్తిస్థాôలో కనిపిస్తా. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. అందుకే ముందు రోజే నాకు సంబంధించిన సంభాషణల్ని తెలుసుకుని, ప్రాక్టీస్‌ చేసి సెట్‌కి వచ్చేదాన్ని’’.
* ‘అనుకోకుండా కొన్ని అవకాశాలు తలుపు తడుతుంటాయి. అలాంటిదే నాకు ‘ఇష్క్‌’ చిత్రం. మెగా సూపర్‌గుడ్‌ సంస్థ కొంత విరామం తర్వాత తెలుగులో చేస్తున్న చిత్రం. ఆ సంస్థలో సినిమా అనగానే నా కెరీర్‌కి కచ్చితంగా ప్లస్‌ అవుతుందని నమ్మా. ఈ కథ గురించి నాకు తెలుసు. మలయాళంలో విజయవంతమైన ఓ సినిమా ఆధారంగా రూపొందింది. దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజు కథ చెప్పగానే బాగా కుదిరిందనే అభిప్రాయం కలిగింది’’.
* ‘‘నటించిన అన్ని సినిమాలూ ఆడవు. ప్రేక్షకుల ఆదరణ కొన్ని చిత్రాలకే లభిస్తుంది. నటిగా ప్రయాణం ముఖ్యం అని నమ్ముతా. పరాజయాలంటారా? వాటి నుంచే ఎక్కువ నేర్చుకుంటామని నా నమ్మకం. తదుపరి సందీప్‌కిషన్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నా. అది మొదలైంది. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి’’.
* ‘‘తేజ మంచి సహనటుడు. నావయసుకు తగ్గట్టు కనిపించే నటుడు. సెట్‌లో చాలా సరదాగా ఉంటూ తెలుగు సంభాషణలు చెప్పడంలో నాకు చాలా సాయం చేశాడు’’.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని