‘వకీల్‌సాబ్‌’తో ఆ రెండూ దక్కాయి
close
Updated : 18/04/2021 08:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వకీల్‌సాబ్‌’తో ఆ రెండూ దక్కాయి

‘‘మహిళలు ‘ఇది మా సినిమా...’ అంటూ సొంతం చేసుకున్నారు. వాళ్లే ప్రచారం చేశారు. ‘మా హీరోకి ఇలాంటి సినిమా పడటం అద్భుతం’ అంటూ అభిమానులు మెచ్చుకున్నారు. ఇలా ఏ రకంగా చూసినా ‘వకీల్‌సాబ్‌’ మెప్పు పొందింది’’ అన్నారు దిల్‌రాజు. ఆయన శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించారు. శ్రీరామ్‌ వేణు దర్శకుడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘చేసిన సినిమా మనసుకు సంతృప్తినివ్వాలి, దాంతో డబ్బు రావాలి. ‘వకీల్‌సాబ్‌’తో ఈ రెండూ మాకు దక్కాయి’ అన్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వాలు యాభై శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు చేయాలనే నిబంధనలు తీసుకొచ్చినా సినిమాలు విడుదల చేయడమే ఉత్తమం అని దిల్‌రాజు చెప్పారు. ‘‘ప్రేక్షకులు సినిమా చూడాలి, అదే సమయంలో కరోనా రాకుండా జాగ్రత్తలన్నీ పాటించాలి. సీటింగ్‌ పరంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు అంగీకారమే. దేశంలో మిగతా చిత్ర పరిశ్రమలతో పోలిస్తే మనం ధైర్యం చేశాం. అందుకే ‘క్రాక్‌’ మొదలుకొని నాలుగు నెలలుగా విజయాల్ని సొంతం చేసుకున్నాం. చిత్ర పరిశ్రమలో అందరికీ ఉపాధి దొరికింది’’ అన్నారు దిల్‌రాజు. శ్రీరామ్‌ వేణు మాట్లాడుతూ ‘‘మంచి సినిమా చేస్తే దాని విజయానికి ఏ అడ్డంకీ ఉండదని తెలుగు ప్రేక్షకులు ‘వకీల్‌సాబ్‌’తో మరోసారి నిరూపించారు. నా మొదటి రెండు చిత్రాల కంటే కూడా ఒక రీమేక్‌తో దర్శకుడిగా నాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు.
మా తదుపరి చిత్రం.. ‘ఐకాన్‌’
నేను, శ్రీరామ్‌ వేణు కలిసి తదుపరి చేయబోయేది ‘ఐకాన్‌’ చిత్రమే అన్నారు దిల్‌రాజు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా రూపొందనున్న చిత్రమిది. ఈ సినిమా గురించి దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘నా మనసుకు బాగా నచ్చిన కథ అది. పూర్తిస్థాయి స్క్రిప్టు సిద్ధంగా ఉంది. దర్శకుడు శ్రీరామ్‌ వేణు ఆ కథ చెప్పినప్పట్నుంచి మేం దాంతో ప్రయాణం చేశాం. కథ మా దగ్గర సిద్ధంగా ఉంది కాబట్టి తప్పక మొదలు పెడతాం’’ అన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని