కేసీఆర్‌గా నటించినందుకు గర్వపడుతున్నా
close
Published : 20/04/2021 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేసీఆర్‌గా నటించినందుకు గర్వపడుతున్నా

- శ్రీకాంత్‌

కేసీఆర్‌ బయోపిక్‌కి ‘తెలంగాణ దేవుడు’ అనే పేరు పెట్టడం ఎంతో సబబుగా ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ. ఆయన మరో సహచర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి ‘తెలంగాణ దేవుడు’ ట్రైలర్‌ని ఇటీవల హైదరా బాద్‌లో విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. శ్రీకాంత్‌ ప్రధాన పాత్ర పోషించారు. జిషాన్‌ ఉస్మాన్‌, సంగీత హీరోహీరోయిన్లు. వడత్య హరీష్‌ దర్శకుడు. మొహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ట్రైలర్‌ విడుదల అనంతరం మహమూద్‌ అలీ మాట్లాడుతూ ‘‘కేసీఆర్‌ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే నాకు నాటి ఉద్యమమే గుర్తుకొస్తుంది. ఇందులో నా మిత్రుడైన శ్రీకాంత్‌... కేసీఆర్‌ పాత్రలో చాలా బాగా నటించాడు’’ అన్నారు.  శ్రీకాంత్‌ మాట్లాడుతూ ‘‘కేసీఆర్‌ బయోపిక్‌ చేస్తున్నానని, మీరు కేసీఆర్‌ పాత్రలో నటించాలని చెప్పగానే షాక్‌  అయ్యా. నేను నటించగలనా? ఆయన పాత్రకి నేను సరిపోతానా? అనే ఆలోచనలతో సమయం తీసుకుని ఆ తర్వాత ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా. తెలంగాణని సాధించిన కేసీఆర్‌ కూడా ఒక రకంగా తెలంగాణ దేవుడే. అలాంటి నాయకుడి పాత్రలో నటించినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.నారాయణమూర్తి, లైన్‌ ప్రొడ్యూసర్‌ మొహమూద్‌ ఖాన్‌, మాక్స్‌ల్యాబ్‌ సీఈఓ మొహమ్మద్‌ ఇంతెహాజ్‌ అహ్మద్‌, నందన్‌ బొబ్బిలి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని