పంచతంత్రం
close
Published : 23/04/2021 08:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంచతంత్రం

బ్రహ్మానందం, సముద్రఖని, కలర్స్‌ స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్‌, రాహుల్‌ విజయ్‌, నరేష్‌ అగస్త్య ప్రధాన పాత్రధారులుగా టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌.ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నారు. అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పంచతంత్రం’ అనే పేరుని ఖరారు చేశారు. గురువారం టైటిల్‌ పోస్టర్‌ని కథానాయకుడు  అడవి శేష్‌ విడుదల చేసి, నటీనటుల వివరాల్ని వెల్లడించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘పంచేంద్రియాల చుట్టూ అల్లుకున్న కథ ఇది. చూపు, వినికిడి, రుచి, స్పర్శ, వాసన... ఇవి ప్రతి జీవికీ అవసరం. వీటిని ఈ కథతో ముడిపెడుతూ భావోద్వేగాల్ని పండించిన తీరు ఆకట్టుకుంటుంది. యువతరం ఆలోచనలు, వాళ్ల దృక్పథాలకి అద్దం పట్టేలా కథ, కథనాలు ఉంటాయి’’ అన్నారు. నిర్మాత సృజన్‌ ఎరబోలు మాట్లాడుతూ ‘‘సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ‘కలర్‌ఫోటో’తో ప్రేక్షకుల్ని అలరించిన దర్శకుడు సందీప్‌రాజ్‌ మా చిత్రానికి మాటలు రాశారు. ప్రశాంత్‌ ఆర్‌.విహారి సంగీతం, తారాగణం మా చిత్రానికి ప్రధానబలం’’ అన్నారు. దివ్య శ్రీపాద, శ్రీవిద్య, ఆదర్శ్‌ బాలకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: కిట్టు విస్సాప్రగడ, ఛాయాగ్రహణం: రాజ్‌ కె.నల్లి.Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని