close
Published : 05/05/2021 07:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘పుష్ప’ జోరు

తగ్గేదే ల్యా అంటున్నాడు ‘పుష్ప’. యూ ట్యూబ్‌లో తన జోరుని కొనసాగిస్తూనే ఉన్నాడు. పుష్పరాజ్‌ పాత్రని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో 60 మిలియన్ల వీక్షణలని సొంతం చేసుకుంది. ‘ఆర్య’, ‘ఆర్య2’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘పుష్ప’. రష్మిక కథానాయిక. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. తెలుగులోనే కాకుండా ఇతర పరిశ్రమల్లోనూ మార్కెట్‌ని పెంచుకుంటున్నారు అల్లు అర్జున్‌. అందుకే ‘పుష్ప’ చిత్రాన్ని పాన్‌ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. దక్షిణాదికి చెందిన నాలుగు ప్రధాన భాషలతో పాటు హిందీలోనూ ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. నాయకా నాయికల పాత్రలు రాయలసీమ యాసలో మాట్లాడి
అలరించనున్నాయి.



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని