close
Published : 05/05/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దాసరి కృషి మార్గదర్శకం

చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి దాసరి నారాయణరావు చేసిన నిరంతర కృషి ఎప్పటికీ మార్గదర్శకమే అన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. మంగళవారం ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా దాసరికి అంజలి ఘటిస్తూ, ఆయన సేవల్ని కొనియాడారు. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి దాసరికి తగిన గుర్తింపు రాకపోవడం తీరని లోటు అన్నారు.
‘‘అపూర్వ దర్శకత్వ ప్రతిభతో చిత్రాల్ని మలిచారు దాసరి నారాయణరావు. విజయాలలో ఒకదానికి మించి మరో చిత్రాన్ని తీశారు. ఆయన మరణానంతరమైనా విశిష్టమైన  పద్మ పురస్కారం దక్కితే...అది తెలుగు చిత్ర పరిశ్రమకి దక్కే గౌరవం అవుతుంద’’ని వ్యాఖ్య చేశారు చిరంజీవి.

నివాళులు...
దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని చలన చిత్ర వాణిజ్య మండలి ఆవరణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు సినీ ప్రముఖులు. అనంతరం కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు నరేష్‌, నిర్మాతలు సి.కల్యాణ్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కొరియోగ్రాఫర్‌ సత్య మాస్టర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని