close
Published : 05/05/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరో రీమేక్‌లో?

కథానాయకుడు వెంకటేష్‌ వరుస రీమేక్‌లతో సెట్స్‌పై సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూడు సినిమాల్లో ‘ఎఫ్‌ 3’ మినహా ‘నారప్ప’, ‘దృశ్యం 2’ రెండూ రీమేక్‌లే. ఇప్పుడివన్నీ తుది దశ చిత్రీకరణలో ఉన్నాయి. అయితే ఇప్పుడాయన మరో క్రేజీ రీమేక్‌ కోసం సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో విజయవంతమైన ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించాలని కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవన్‌ కల్యాణ్‌తో రామ్‌చరణ్‌ ఈ సినిమా పట్టాలెక్కిస్తున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ, తర్వాత అది అవాస్తవమని తేలింది. అయితే ఇప్పుడీ చిత్ర హక్కులను సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ దక్కించుకుందని సమాచారం. త్వరలో వెంకటేష్‌తో ఈ సినిమా పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు మొదలయ్యాయని సమాచారం. ఇందులో వెంకీతో పాటు కలిసి  మరో హీరో కనిపిస్తారు. మరి ఆ పాత్ర ఎవరికి దక్కుతుందో చూడాలి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని