ఇద్దరు నాయికలతో..
close
Published : 06/05/2021 00:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇద్దరు నాయికలతో..

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తోన్న కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో బాలకృష్ణకు జోడీగా ఇద్దరు కథానాయికలు కనిపించనున్నారని సమాచారం. ఇటీవల కాలంలో బాలకృష్ణ సినిమాల్లో ఎక్కువగా ఇద్దరు నాయికలు కనిపిస్తున్నారు. గోపీచంద్‌ తీసే చిత్రాల్లోనూ ఇద్దరు భామలకు చోటుంటోంది. ఇటీవల ఆయన నుంచి వచ్చిన ‘క్రాక్‌’లో శ్రుతిహాసన్‌తో పాటు అప్సర రాణి తళుక్కున మెరిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ క్రమంలోనే బాలకృష్ణ కోసం ఇద్దరు నాయికల్ని రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఓ నాయికగా రాయ్‌ లక్ష్మీ పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య ఓ శక్తిమంతమైన పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారని సమాచారం.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని