Cinema: మరోసారి ‘పార్థు’గా?
close
Published : 06/05/2021 06:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema: మరోసారి ‘పార్థు’గా?

నిండైన తెలుగుదనానికి నిలువుటద్దాల్లా నిలుస్తుంటాయి దర్శకుడు త్రివిక్రమ్‌ చిత్రాలు. ఆయన తెరకెక్కించే సినిమాలుఅన్నింటికీ అచ్చ తెలుగు టైటిళ్లనే ఖరారు చేస్తుంటారు. అంతేకాదు వీటిలో ఎక్కువ వరకు ‘అ’ అక్షరంతో మొదలైనవే ఉంటాయి. ‘అతడు’ నుంచి ‘అల.. వైకుంఠపురములో’ వరకు ఆయన నుంచి వచ్చిన చిత్రాల్లో ఎక్కువ శాతం ‘అ’తో మొదలైన టైటిళ్లే ఉన్నాయి. అందుకే ‘అ’తో టైటిల్‌ ఖరారు చేయడం ఆయనకు ఓ సెంటిమెంట్‌ అని చిత్ర సీమలో ప్రచారం వినిపిస్తుంటుంది. అయితే ఇప్పుడాయన తన కొత్త చిత్రం కోసం ఈ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మహేష్‌బాబుతో ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న మూడో చిత్రమిది. ఈనెల 31న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఇప్పుడీ సినిమా కోసం ‘పార్థు’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ‘అతడు’లో మహేష్‌ పోషించిన పాత్ర పేరు ఇది. ఈ సినిమాలోనూ ఆయన అదే పేరుతో కనిపించనున్నట్లు తెలుస్తుంది. అందుకే ప్రస్తుతానికి దీన్నే వర్కింగ్‌ టైటిల్‌గా ఫిక్స్‌ చేశారని, మరో కొత్త పేరు దొరికితే తప్ప ‘పార్థు’నే టైటిల్‌గా ఖరారు చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని