బాలకృష్ణ చిత్రంలో మీనా?
close
Published : 10/05/2021 14:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలకృష్ణ చిత్రంలో మీనా?

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న ‘అఖండ’ పూర్తయిన వెంటనే ఈ సినిమాని పట్టాలెక్కించనున్నారు. ఇప్పుడు చిత్ర బృందం మిగిలిన తారాగణాన్ని ఖరారు చేసే పనిలో పడింది. ఈ క్రమంలోనే నటి మీనాను ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. 90ల్లో స్టార్‌ నాయికగా తెలుగులోని అగ్ర తారలందరితోనూ జోడీ కట్టి అలరించింది మీనా. బాలకృష్ణతో ‘ముద్దుల మొగుడు’, ‘బొబ్బిలి సింహం’లోనూ ఆడిపాడింది. ఇప్పుడిన్నేళ్ల తర్వాత ఈ కొత్త సినిమా కోసం బాలయ్యతో తెర పంచుకోనుంది ఆమె. కొన్ని వాస్తవ   సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథతో ఈ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులోని ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్లలో మీనా ఓ కీలక పాత్రలో సందడి చేయనుందట. ఆమె పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలువనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మీనా ప్రస్తుతం వెంకటేష్‌కు జోడీగా ‘దృశ్యం 2’ చిత్రంలో నటిస్తోంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని