అనుకున్నాం కానీ...
close
Published : 10/05/2021 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనుకున్నాం కానీ...

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్‌’. ‘సాలా క్రాస్‌ బ్రీడ్‌..’ అనేది ఉపశీర్షిక. అనన్యపాండే కథా నాయిక. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమాని పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌, కరణ్‌జోహార్‌, అపూర్వ మెహతా కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని కాస్త ఆలస్యంగా విడుదల చేస్తామని చిత్రబృందం ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘విజయ్‌ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా మే 9న యాక్షన్‌ టీజర్‌ని విడుదల చేయాలనుకున్నాం. కానీ... కరోనా రెండో దశ కారణంగా ఏర్పడిన పరిస్థితులు ప్రతి ఒక్కరికీ బాధ కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్న ఈ తరుణంలో టీజర్‌ విడుదలని వాయిదా వేశాం. ఈ క్లిష్ట సమయం గడిచిపోయాక విడుదల చేస్తాం. అప్పటివరకు అందరం బాధ్యతగా, ఒకరికొకరు సాయంగా నిలుద్దాం. ఈ చిత్రంలో విజయ్‌ కనిపించే విధానం, ఆయన నటన అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, రోనిత్‌రాయ్‌,విషురెడ్డి, అలీ, మకరంద్‌ దేశ్‌పాండే తదితరులు నటిస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని