‘బోర్డర్‌’లో రా ఏజెంట్‌
close
Published : 14/05/2021 02:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బోర్డర్‌’లో రా ఏజెంట్‌

తన సినీ ప్రయాణాన్ని వైవిధ్యభరితంగా ముందుకు తీసుకెళ్తోంది నటి రెజీనా. ప్రయోగాత్మక పాత్రలతో సినీప్రియులను అలరించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల కాలంలో ‘ఎవరు’, ‘7’, ‘చక్ర’ లాంటి చిత్రాల్లో ఆమె ప్రతినాయిక ఛాయలున్న పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడామె ‘బోర్డర్‌’ అనే తమిళ సినిమా కోసం రా ఆఫీసర్‌గా మారింది. అరుణ్‌ విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. అరివళగన్‌ దర్శకుడు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. ఇందులో రెజీనా శక్తిమంతమైన రా అధికారికగా దర్శనమివ్వనుంది. తాజాగా చిత్ర బృందం ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఆమె రా ఏజెంట్‌గా చేతిలో తుపాకి పట్టుకొని సీరియస్‌ లుక్‌లో కనిపించింది. విభిన్నమైన స్పై థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. యాక్షన్‌కు ప్రాధాన్యముంది. స్టెఫీ పటేల్‌ మరో నాయికగా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోన్న ఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని