వారి కోడల్ని కావాలి
close
Published : 14/05/2021 02:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారి కోడల్ని కావాలి

చిత్రసీమలోకి వచ్చిన అనతి కాలంలోనే వరుస విజయాలతో స్టార్‌ నాయికగా మారిపోయింది రష్మిక. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌ హీరోలందరితోనూ ఆడిపాడుతున్న ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో జోరు చూపిస్తోంది. తాజాగా ఆమె పెళ్లి విషయమై ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ‘‘తమిళ సంస్కృతి, సంప్రదాయాలంటే నాకు చాలా ఇష్టం. అక్కడి భోజనం.. ఆహార పదార్థాలు రుచికరంగా ఉంటాయి. ఎప్పటికైనా తమిళ వాసుల ఇంటి కోడలిని కావాలన్నది నా కోరిక’’ అని తన మనసులో మాట బయట పెట్టింది రష్మిక. ఆమె ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్‌లో ‘మిషన్‌ మజ్ను’, ‘గుడ్‌బై’ చిత్రాలు చేస్తోంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని