‘బంగార్రాజు’ పైనే గురి
close
Published : 16/05/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బంగార్రాజు’ పైనే గురి

కథానాయకుడు నాగార్జున దృష్టంతా ఇప్పుడు ‘బంగార్రాజు’పైనే ఉంది. లాక్‌   డౌన్‌తో దొరికిన ఈ సమయాన్ని పూర్తిగా ఆ సినిమా కోసమే కేటాయిస్తున్నారు. కథా చర్చల్లో పాల్గొంటూ స్క్రిప్టుని పక్కా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోపక్క సంగీత చర్చలు సాగుతున్నట్టు తెలిసింది. ఈ సినిమా ప్రస్తావన ఎప్పుడొచ్చినా సరే... పండగ సినిమా అంటుంటారు నాగార్జున. అంటే వచ్చే సంక్రాంతి లక్ష్యంగానే ‘బంగార్రాజు’ సినిమాని చేస్తారన్నమాట.  అందుకే నాగ్‌ ఆ సినిమాపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. విజయవంతమైన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకి కొనసాగింపుగా రూపొందనున్న చిత్రమే ‘బంగార్రాజు’. ఇలాంటి మాస్‌ అంశాలతో కూడిన సినిమాని నాగార్జున చేసి చాలా కాలమైంది. ఇందులో నాగార్జునతోపాటు ఆయన వారసుల్లో ఎవరో ఒకరు కనిపించే అవకాశాలు ఉన్నాయని  సమాచారం. ఆ వివరాలన్నీ బయటికి రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని