రెండో షెడ్యూల్‌కి రెడీ
close
Published : 17/05/2021 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండో షెడ్యూల్‌కి రెడీ

నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. నారాయణదాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్‌ కథానాయిక. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. అయితే కొన్ని సృజనాత్మక విభేదాల వల్ల ఈ చిత్రం ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు చిత్ర బృందం కొత్త షెడ్యూల్‌కి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయట పెట్టింది. ఈ సినిమా రెండో షెడ్యూల్‌ జూన్‌ తొలి వారం నుంచి మొదలు కానుందని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది. ఇందుకోసం చిత్ర బృందం లండన్‌కు ప్రయాణం కానుందని సమాచారం. ఓ విభిన్నమైన యాక్షన్‌ డ్రామా కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. నాగార్జున ఓ శక్తిమంతమైన రా ఏజెంట్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని