Family Man 2: ఫ్యామిలీ మేన్‌ 2 ట్రైలర్‌ వస్తోంది
close
Updated : 18/05/2021 08:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Family Man 2: ఫ్యామిలీ మేన్‌ 2 ట్రైలర్‌ వస్తోంది

‘ది ఫ్యామిలీ మేన్‌’ వెబ్‌ సిరీస్‌ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘ది ఫ్యామిలీ మేన్‌ 2’ తెరకెక్కింది. దీన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరిగాయి. కానీ విడుదల వాయిదా పడింది. ఇప్పుడిది...వచ్చే నెల 11న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 19న ట్రైలర్‌విడుదల చేయనున్నట్టు తాజా సమాచారం. మనోజ్‌ బాజ్‌పాయ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్‌సిరీస్‌లో ప్రముఖ కథా నాయిక సమంత కీలక పాత్రలో నటించారు. దీంతో ఈ వెబ్‌ సిరీస్‌పై మరింత ఆసక్తి పెరిగింది. రాజ్‌, డీకే తెరకెక్కించిన ఈ సిరీస్‌లో ప్రియమణి, శరద్‌ కేల్కర్‌, శ్రేయా ధన్వంతరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని