చీకటిలో ఉండే వెలుతురుని...
close
Updated : 05/06/2021 04:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చీకటిలో ఉండే వెలుతురుని...

‘‘నేను చీకటిలో ఉండే వెలుతురుని..వెలుతురులో ఉండే చీకటిని’’ అంటున్నారు నటుడు మోహన్‌బాబు. ఇప్పుడాయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. డైమండ్‌ రత్నబాబు దర్శకుడు. మంచు విష్ణు నిర్మాత. ఈ చిత్ర  టీజర్‌ను హీరో సూర్య శుక్రవారం విడుదల చేశారు. దీనికి కథానాయకుడు చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ అందించడం విశేషం. ‘‘మన అంచనాలకు అందని ఓ వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయనున్నాను. తన రూటే సపరేటు. తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో.. ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో.. ఆ దేవుడికే ఎరుక. తన బ్రెయిన్‌లోని న్యూరాన్స్‌.. ఎప్పుడు ఎలాంటి థాట్స్‌ని ట్రిగ్గర్‌ చేస్తాయో ఏ బ్రెయిన్‌ స్పెషలిస్టు చెప్పలేడు’’ అంటూ చిరు వాయిస్‌ ఓవర్‌తో మోహన్‌బాబు పాత్రని పరిచయం చేశారు. ప్రచార చిత్రంలో ఆయన విభిన్నమైన లుక్స్‌లో.. చాలా శక్తిమంతంగా కనిపించారు. ఆఖర్లో ‘‘నేను కసక్‌ అంటే.. మీరందరూ ఫసక్‌’’ అంటూ మెహన్‌బాబు చెప్పిన డైలాగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌, శ్రీకాంత్‌, అలీ, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీనికి మోహన్‌బాబు స్వయంగా స్క్రీన్‌ప్లే అందించడం మరో విశేషం. సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి.

‘సన్నాఫ్‌ ఇండియా’ చిత్ర టీజర్‌కి వాయిస్‌ ఓవర్‌ అందించిన కథా  నాయకుడు చిరంజీవి, టీజర్‌ విడుదల చేసిన హీరో సూర్యలకు ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు మోహన్‌బాబు. ‘‘ఈ చిత్రానికి ప్రారంభంలో వాయిస్‌ ఓవర్‌ అవసరమైంది. దానికి చిరంజీవి వాయిస్‌ బాగుంటుందని విష్ణు అన్నాడు. వెంటనే చిరుకు ఫోన్‌ చేసి అడిగాను. ఆ వాయిస్‌ ఓవర్‌ మ్యాటర్‌ నాకు పంపు అన్నారు. పంపాను. ‘ఆచార్య’ షూటింగ్‌లో బిజీగా ఉన్నా.. నేను అడిగిన మూడు రోజుల్లోనే నాకు చెప్పకుండా తనే థియేటర్‌ బుక్‌ చేసి డబ్బింగ్‌ చెప్పి పంపాలనుకున్నారు. ఆ విషయం నాకు తెలిసి విష్ణుని డబ్బింగ్‌ థియేటర్‌కి పంపా. తనని చూడగానే ‘నిన్నెవరు రమ్మన్నారు.. డబ్‌ చేసి నేనే మీ నాన్నకి సర్‌ప్రైజ్‌ ఇద్దామనుకున్నా’ అన్నారు. అంత గొప్ప మనసు ఎవరికి ఉంటుంది. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను అడిగిన వెంటనే టీజర్‌ విడుదల చేసిన సూర్యకి.. ఆయనకి నాపై ఉన్న ప్రేమకి ధన్యవాదాలు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌తో మీ ముందుకి వస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని