ప్రేమ్‌ పెళ్లి కథ
close
Published : 05/06/2021 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రేమ్‌ పెళ్లి కథ

‘ఏక్‌ మినీ కథ’తో వినోదాన్ని పంచుతున్నారు సంతోష్‌ శోభన్‌. ఆయన కథానాయకుడిగా సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. రాశీసింగ్‌ కథానాయిక. అభిషేక్‌ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శివప్రసాద్‌ పన్నీరు నిర్మాత. ఈ చిత్రానికి ‘ప్రేమ్‌కుమార్‌’ అనే పేరుని ఖరారు చేసినట్టు ప్రకటించింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘‘పెళ్లి కావడం లేదనే నిరాశలో ఉన్న ఓ పెళ్లికొడుకు కథ ఇది. సినిమాల్లో పతాక సన్నివేశాల్లో కథానాయకుడు నేరుగా పెళ్లి మంటపానికి వచ్చి తనదైన శైలిలో హీరోయిన్‌ని పెళ్లి చేసుకుని తీసుకెళ్లిపోతాడు. కానీ అదే పెళ్లి పీటలపై ఒంటరిగా మిగిలిపోయిన పెళ్లికొడుకును మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. అలాంటి పెళ్లి కొడుకు కథే ఈ చిత్రం’’ అన్నారు. ‘‘దర్శకుడు అభిషేక్‌ మహర్షి, రచయిత అనిరుధ్‌ కృష్ణమూర్తి కలిసి కడుపుబ్బా నవ్వించే ఓ మంచి కథని రాశారు. సంతోష్‌ శోభన్‌ పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇప్పటికే ఎనభై శాతం చిత్రీకరణ పూర్తయింద’’న్నారు. కృష్ణచైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్‌, అశోక్‌కుమార్‌, ప్రభావతి, మధు నటిస్తున్న ఈ  చిత్రానికి ఛాయాగ్రహణం: రాంపీ నందిగాం, సంగీతం: అనంత్‌ శ్రీకర్‌.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని