Dhanush: జగమే సంగీతమంత్రం
close
Updated : 08/06/2021 09:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Dhanush: జగమే సంగీతమంత్రం

ధనుష్‌ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘జగమేతంతిరం’. ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్‌, కలైయారసన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. వై నాట్‌ స్టూడియోస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళం, కన్నడ, మలయాళంతోపాటుగా... తెలుగులోనూ ‘జగమే తంత్రం’ పేరుతో ఈ నెల 18న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుందీ చిత్రం. సంతోష్‌ నారాయణన్‌ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాలోని పాటల్ని సోనీ మ్యూజిక్‌ సంస్థ విడుదల చేసింది. ‘‘గ్యాంగ్‌స్టర్‌గా ధనుష్‌ చేసే సందడి అలరిస్తుంది. కార్తీక్‌ సుబ్బరాజు విభిన్నమైన కథ, కథనాలతో తెరకెక్కించారు. ఇందులో ఎనిమిది పాటలుంటాయి. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు శ్రోతల్ని అలరించాయి. ఇందులో పాటలన్నీ ఎంతో ప్రత్యేకం, వినూత్నం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.
ధనుష్‌ తెలుగు చిత్రం?
తమిళ కథానాయకులు నేరుగా తెలుగులో సినిమాలు చేయడంపై ఆసక్తి చూపుతున్నారు. తెలుగులో ఇప్పటికే బలమైన మార్కెట్‌ని సొంతం చేసుకున్న ఆ కథానాయకులు, నేరుగా తెలుగు చిత్రాలు చేయడంతో మరింతగా ప్రేక్షకులకు చేరువ కావొచ్చనేది వ్యూహం. ఇప్పటికే కార్తి తెలుగు చిత్రం చేశాడు. విజయ్‌ త్వరలోనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అదే తరహాలో ధనుష్‌  త్వరలోనే ఓ తెలుగు చిత్రం చేయొచ్చని ప్రచారం సాగుతోంది. ఆ మేరకు అగ్ర దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ధనుష్‌ చిత్రాలు ఇప్పటికే తెలుగులో అనువాదమవుతూ అలరిస్తున్నాయి.






మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని