vishwak sen: ‘ఫలక్‌నుమా దాస్‌ 2’తో మళ్లీ కలుస్తున్నాం
close
Updated : 08/06/2021 10:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

vishwak sen: ‘ఫలక్‌నుమా దాస్‌ 2’తో మళ్లీ కలుస్తున్నాం

మలయాళంలో విజయవంతమైన ‘అంగమలై డైరీస్‌’ చిత్రాన్ని తెలుగులో ‘ఫలక్‌నుమా దాస్‌’ పేరుతో రీమేక్‌ చేసి ప్రేక్షకుల మెప్పు పొందారు కథా నాయకుడు విష్వక్‌ సేన్‌. ఆయన ఈ సినిమాని తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఫలక్‌నుమా దాస్‌ 2’ తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులకు తెలియజేశారు. విష్వక్‌ తాజాగా ‘ఫలక్‌నుమా దాస్‌’ ముహూర్తపు కార్యక్రమానికి సంబంధించిన ఓ పాత ఫొటోని తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘‘3ఏళ్ల కిత్రం ‘ఫలక్‌నుమా దాస్‌’ ముహూర్తం షాట్‌. నిన్ననే జరిగినట్లు అనిపిస్తుంది. ఈ చిత్ర బృందం ‘ఫలక్‌నుమా దాస్‌ 2’ కోసం త్వరలోనే తిరిగి కలవబోతుంద’’ని ఆ ఫొటోతో పాటు సీక్వెల్‌పై స్పష్టత ఇచ్చారు. నిజానికి మలయాళంలో ‘అంగమలై డైరీస్‌’కి సీక్వెల్‌ రాలేదు. కానీ, ఇప్పుడాయన తన సొంత కథతోనే ఈ సీక్వెల్‌ని పట్టాలెక్కించనున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం విష్వక్‌ నటించిన ‘పాగల్‌’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని