ఘంటసాల రత్నకుమార్‌ కన్నుమూత
close
Published : 11/06/2021 04:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఘంటసాల రత్నకుమార్‌ కన్నుమూత

సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ ఘంటసాల రత్నకుమార్‌ (64) చెన్నైలో గురువారం ఉదయం కన్నుమూశారు. రత్నకుమార్‌  ప్రారంభంలో సినిమాలకు పాటలు పాడారు. తర్వాత తెలుగు-తమిళం డబ్బింగ్‌ రంగంలో  ఉన్నతస్థాయికి ఎదిగారు. మలయాళం, హిందీ భాషల్లోనూ డబ్బింగ్‌ చెప్పారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడిన రత్నకుమార్‌ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా నెగిటివ్‌ వచ్చింది. అయినప్పటికీ కిడ్నీ సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చికిత్స కొనసాగించారు. డయాలసిస్‌ చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే ఆయన గురువారం గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఆయన మృతిపట్ల ఏపీ సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

- న్యూస్‌టుడే, కోడంబాక్కం


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని