అదే ప్రతిభను వెలికితీస్తుంది
close
Published : 11/06/2021 04:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదే ప్రతిభను వెలికితీస్తుంది

‘‘అభద్రత... మనల్ని బలంగా తయారు చేస్తుంది.’’ అంటోంది కియారా అడ్వాణి. ‘భరత్‌ అనే నేను’తో తెలుగులో మెరిసిన ఈ అందాల భామ ‘కబీర్‌ సింగ్‌’ చిత్రంతో దేశవ్యాప్త అభిమానులను సంపాదించుకుంది. ‘మీరు నటిగా అభద్రతకు గురవుతున్నారా?’ అని ఇటీవల ఆన్‌లైన్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నకు స్పందించింది. ‘‘అవును... అభద్రత నాలోని ఉత్తమమైన ప్రతిభను వెలికితీస్తుంది. అది మనల్ని పరిస్థితుల్ని ఎదుర్కొనే బలవంతులుగా తయారుచేస్తుంది. ప్రతి ఒక్కరిలో అభద్రత కొంచెమైనా ఉంటే...నాకు తెలిసి వారు పూర్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు.’’ అని చెప్పింది. ప్రస్తుతం ఆమె ‘జుగ్‌ జుగ్‌ జియో’, ‘షేర్‌ షా’ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులోనూ రెండు ప్రాజెక్టులు చర్చలు దశలో ఉన్నాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని