తండ్రీ కొడుకులు కలిసి
close
Published : 12/06/2021 02:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తండ్రీ కొడుకులు కలిసి

థానాయకుడు బాలకృష్ణ సినీప్రియులకు కొత్త కబురు అందించారు. ‘ఆదిత్య 369’ సీక్వెల్‌తో తన తనయుడు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఆదిత్య 369’కి కొనసాగింపుగా ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’ పేరుతో ఓ సినిమా తీసుకురానున్నట్లు బాలకృష్ణ గతంలోనే ప్రకటించారు. ఇందుకోసం ఆయనే స్వయంగా కథ సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడా కథతోనే ‘ఆదిత్య 999’ని పట్టాలెక్కించనున్నట్లు తెలియజేశారు. ఇందులో తాను, తన తనయుడు కలిసి నటిస్తామని.. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని క్లారిటీ ఇచ్చారు. అయితే దీనికి దర్శకుడిగా ఎవరు వ్యవహరిస్తారన్నది స్పష్టత ఇవ్వలేదు.

బాలయ్య చిత్రంలో వరలక్ష్మి

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ఎంపిక చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆమె ఈ చిత్రంలో ఓ శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తుందని తెలియజేసింది. దీనిపై వరలక్ష్మి స్పందిస్తూ.. ‘‘క్రాక్‌’ అనంతరం నాకెంతో ఇష్టమైన దర్శకుడు గోపీచంద్‌ మలినేనితో మళ్లీ కలిసి పని చేస్తున్నా. అది కూడా బాలయ్య సినిమా కోసం. చాలా ఆనందంగా ఉంది. సెట్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని తెలిపింది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని