రాణి నిజంగానే హత్య చేసిందా?
close
Updated : 12/06/2021 07:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాణి నిజంగానే హత్య చేసిందా?

అందమైన భార్య, ప్రేమగా చూసుకునే భర్త...హాయిగా సాగిపోతున్న సంసారంలో ఒక్క సారిగా విషాదం. ప్రమాదంలో భర్త మరణం...అది భార్య పనే అని పోలీసుల అనుమానం. రాణి జీవితంలో మరో వ్యక్తి ప్రవేశం.. ఇలా సాగే ఓ ఈ కథలో హత్య చేసిందెవరు? పోలీసులు మాత్రం రాణియే భర్తను హత్య చేసింది అని నమ్ముతారు..మరి నిజం ఏంటి? రాణి జీవితం తర్వాత ఎలాంటి మలుపులు తిరిగిందో తెలియాలంటే ‘హాసిన్‌ దిల్‌ రూబా’ చూడాల్సిందే. తాప్సి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా వచ్చే నెల 2న విడుదల కానుంది. విక్రాంత్‌ మస్సే, హర్షవర్థన్‌ రాణే కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘‘నేను ఇప్పటివరకూ పోషించని ఓ పాత్ర రాణి. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది’’అని చెబుతోంది తాప్సి. వినిల్‌ మాథ్యూ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని