పక్కా స్టైలిష్‌
close
Published : 12/06/2021 02:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పక్కా స్టైలిష్‌

గోపీచంద్‌ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా కథానాయిక. సత్యరాజ్‌, రావు రమేశ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శనివారం గోపీచంద్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో గోపీచంద్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు. ‘‘మారుతి శైలిలో సాగే కొత్తదనం నిండిన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. గోపీచంద్‌ కనిపించే తీరు.. ఆయన పాత్ర చిత్రణ కొత్తగా ఉంటాయి. ఇప్పటికే 40శాతం చిత్రీకరణ పూర్తయింది. జులై తొలివారం నుంచి కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది’’ అని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాకి సంగీతం: జకేస్‌ బీజాయ్‌, కూర్పు: ఎన్‌ పి ఉద్భవ్‌, ఛాయాగ్రహణం: కరమ్‌ చావ్ల.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని