ఆ సినిమాలకే ప్రాధాన్యమివ్వాలి
close
Updated : 18/06/2021 04:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ సినిమాలకే ప్రాధాన్యమివ్వాలి

కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతితో ఆగిన సినిమా చిత్రీకరణలన్నీ పునఃప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని షూటింగ్‌ ప్రారంభించుకోగా.. మరికొన్ని  సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌, తెలుగు ఫిల్మ్‌ డైరెక్టర్‌ అసోసియేషన్‌. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ గురువారం హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా చిత్రీకరణల విషయంలో కొన్ని కీలక తీర్మానాలు చేశాయి. నటీనటులు, ఇతర సాంకేతిక సిబ్బంది ఎవరైనా సరే.. గతంలో షూటింగ్‌ చేస్తూ ఆగిపోయిన సినిమాలకే తొలి ప్రాధాన్యమివ్వా   లన్నారు. ఆ చిత్రాలు పూర్తయ్యాకే కొత్తవి చేయాలని నిర్ణయించారు. కరోనా వల్ల ఆగిపోయి ఉన్న చిత్రాలకు.. షెడ్యూల్స్‌ని కుదించుకుని తక్కువ రోజుల్లో నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు.చిత్రీకరణల్లో పాల్గొనే ప్రతిఒక్కరూ కచ్చితంగా వ్యాక్సినేషన్‌ తీసుకోవాలని, ఇందుకు సంబంధించి నిర్మాణ సంస్థలు ప్రతి   ఒక్కరి నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే 24 విభాగాల సభ్యులందరికీ ఇన్స్యూరెన్స్‌ విధిగా చేయించాలని, ఆ బాధ్యతను ఫెడరేషన్‌, ఆయా యూనియన్‌ వారు తీసుకోవాలని పేర్కొన్నారు. సెట్లో ప్రభుత్వ మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ విషయాలకు సంబంధించి సలహాలు, ఫిర్యాదులేమైనా ఉంటే తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ వారికి వెంటనే తెలియజేయాలన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని