తెరపై బొమ్మ పడేనా?
close
Updated : 20/06/2021 07:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెరపై బొమ్మ పడేనా?

ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు?


లాక్‌డౌన్‌ ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లని యథావిధిగా తెరచుకోవచ్చని స్పష్టం చేసింది. చిత్రసీమకి ఇది ఊరట కలిగించే విషయమే. దాదాపు రెండు నెలలైంది ప్రదర్శనలు నిలిచిపోయి. పదుల సంఖ్యలో సినిమాలు విడుదల ముంగిట ఆగిపోవల్సి వచ్చింది. ఇప్పుడు ఆ చిత్రాలన్నీ విడుదలకి సన్నద్ధమవుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా లాక్‌డౌన్‌ నిబంధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు సినిమాకి 60 శాతం మార్కెట్‌ అక్కడే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైతేనే అందరికీ మేలు జరుగుతుంది. అందుకే నిర్మాతలు ఆంధ్రప్రదేశ్‌లోనూ అనుమతులు ఇచ్చేవరకు వేచి చూడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
పరిమిత వ్యయంతో తెరకెక్కిన సినిమాలు, ఇదివరకు విడుదలైనవి తెలంగాణలో ప్రదర్శించుకునే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రదర్శన  కారులు ఆసక్తి చూపడం లేదు. పాత సినిమాపై ప్రేక్షకులు మొగ్గు చూపడం లేదని ప్రదర్శనకారులు చెబుతున్నారు. తొలి దశ కరోనా తర్వాత థియేటర్లు  తెరిచిన వెంటనే, ఓటీటీలో విడుదలైన సినిమాల్ని థియేటర్లలో ప్రదర్శనకి ఉంచారు. వాటికి ప్రేక్షకుల ఆదరణ కరవవడంతో వెంటనే థియేటర్ల నుంచి తొలగించారు. ఈసారి కొత్త సినిమాలు విడుదలయ్యే వరకు వేచి చూడనున్నారు.

ప్రభుత్వం దగ్గరికి... 

తొలి లాక్‌డౌన్‌ తర్వాత చిత్ర పరిశ్రమకి ప్రభుత్వం పలు రాయితీల్ని ప్రకటించింది. థియేటర్ల కరెంటు బిల్లుల రద్దు, ప్రదర్శనల విషయంలో వెసులుబాటు తదితర విషయాల్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు ఆ హామీలు నెరవేరకపోవడంతో థియేటర్‌ యాజమాన్యాలు మరోమారు ప్రభుత్వం దగ్గరికి వెళ్లనున్నాయి. ఆ హామీలపై ప్రభుత్వం స్పందించేవరకు థియేటర్లని తెరవకూడదని తెలంగాణ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది. ఆ మేరకు త్వరలోనే  తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిని వారు కలవనున్నారు. 

పరిమిత వ్యయంతో తెరకెక్కిన సినిమాలు, ఇది వరకు విడుదలైనవి తెలంగాణలో ప్రదర్శించుకునే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రదర్శనకారులు ఆసక్తి చూపడం లేదు. పాత సినిమాపై ప్రేక్షకులు మొగ్గు చూపడం లేదని ప్రదర్శనకారులు చెబుతున్నారు. తొలి దశ కరోనా తర్వాత థియేటర్లు తెరిచిన వెంటనే, ఓటీటీలో విడుదలైన సినిమాల్ని థియేటర్లలో ప్రదర్శనకి ఉంచారు. వాటికి ప్రేక్షకుల ఆదరణ కరవవడంతో వెంటనే థియేటర్ల నుంచి తొలగించారు. అందుకే ఈసారి కొత్త సినిమాలు విడుదలయ్యే వరకు వేచి చూడనున్నారు.
మల్టీప్లెక్స్‌లు రెడీ  

సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు లేకపోయినా మల్టీప్లెక్స్‌లో మాత్రం సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణలో 600కిపైగా థియేటర్లు ఉన్నాయి. అందులో 250కిపైగా ఉన్న మల్టీప్లెక్స్‌ల్లో ప్రదర్శనలు షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మల్టీప్లెక్స్‌ థియేటర్లు ఒక రాష్ట్రంతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఒకే గొడుగు కింద ఉంటాయి. వాటిలో ఆంగ్ల, హిందీ సినిమాలు  విడుదలయ్యే అవకాశాలున్నాయి. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభిస్తే సింగిల్‌ థియేటర్లు ప్రదర్శనల్ని షురూ చేసేందుకు సిద్ధం కానున్నాయి. సినిమాలు విడుదల కావడమే ఇప్పుడు కీలకంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో  పరిస్థితుల్ని బట్టే కొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని