నాన్న... మీరే మా జీవిత కథానాయకుడు
close
Updated : 21/06/2021 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాన్న... మీరే మా జీవిత కథానాయకుడు

ఓ మనిషి తేజస్సు పదిమందిని చైతన్యం చేస్తోందంటే... అతను అలా వెలిగిపోవడానికి కొవ్వొత్తిలా కరిగిన నాన్న వెనుకున్నాడని అర్థం. ఓ వ్యక్తి మంచి శిల్పంలా అందర్నీ ఆకర్షిస్తున్నాడంటే... అతన్ని అలా మలిచే క్రమంలో రాతి ముక్కలు రాలిపోయిన నాన్న కష్టం ఉందని అర్థం. ఎవరైనా ఒకరు ఎవరెస్ట్‌ంత ఎత్తుకు ఎదిగాడంటే... అతని ఎక్కిన ప్రతి మెట్టు కింద నాన్న భుజం ఉందని అర్థం.

...అందుకే ఏ బిడ్డకైనా నాన్నే సూపర్‌హీరో. ఆయనే స్ఫూర్తి. ఆదివారం ఫాదర్స్‌డే. ఈ సందర్భంగా పలువురు సినీతారలు తమ తండ్రులతో ఉన్న అనుబంధాల్ని గుర్తుచేసుకుంటూ.. సామాజిక మాధ్యమాల వేదికగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మీరే మా స్ఫూర్తి నాన్న’ అంటూ తమ తండ్రులతో దిగిన అపురూప చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు.నాన్న.. ‘మెగా’ బహుమానం
‘‘మీతో గడిపే ప్రతి నిమిషం.. నాకెప్పటికీ విలువైనదే. హ్యాపీ ఫాదర్స్‌డే’’.
- రామ్‌చరణ్‌


నాన్న.. సాటిలేని స్ఫూర్తి
‘‘నా హీరో.. నాకు భవితకు దారి చూపే చిరు దీపం.. స్ఫూర్తి.. ప్రేరణ.. అన్నీ మీరే’’.
- మహేష్‌బాబు


నాన్న.. ‘అల్లు’కున్న ప్రేమ
‘‘ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి తండ్రికీ హ్యాపీ ఫాదర్స్‌ డే’’.
- అల్లు అర్జున్‌


నాన్న.. అద్వితీయ స్నేహం
‘‘మన కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ నువ్వే బెస్ట్‌ ఫ్రెండ్‌ నాన్న. మా అందరిలో స్ఫూర్తిని నింపావు. మీ ప్రేమ.. ప్రోత్సాహం లేకపోతే ఈరోజున మేము ఈస్థాయిలో ఉండేవాళ్లం కాదు. థ్యాంక్యూ డాడీ. వి లవ్‌ యూ’’.
- మంచు లక్ష్మి


నాన్న.. గెలుపు పాఠం
‘‘నా బలం మీరే. హ్యాపీ ఫాదర్స్‌ డే’’.
- రవితేజ


నాన్న.. తూరుపు కిరణం
‘‘నా జీవితంలోని ప్రేమ మీరే నాన్న. సూపర్‌ హీరోలందరికీ పితృదినోత్సవ శుభాకాంక్షలు’’.
- శివాత్మిక రాజశేఖర్‌


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని