గుమ్మడికాయ కొట్టేశారు
close
Published : 21/06/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గుమ్మడికాయ కొట్టేశారు

నితిన్‌ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మాస్ట్రో’. ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. నభా నటేష్‌ కథానాయిక. తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఆఖరి షెడ్యూల్‌ మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ కొత్త లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నితిన్‌, నభా సముద్ర తీరంలో కూర్చోని పార్టీ చేసుకుంటున్నట్లు  కనిపించారు. ‘‘హిందీలో విజయవంతమైన ‘అంధాదూన్‌’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్‌, కూర్పు: ఎస్‌ఆర్‌ శేఖర్‌, ఛాయాగ్రహణం: జె.యువరాజ్‌.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని