తిట్టినా బాగుంటాదే.. కొట్టినా బాగుంటాదే
close
Published : 23/06/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిట్టినా బాగుంటాదే.. కొట్టినా బాగుంటాదే

‘‘అమ్మాయిలందరూ దేవతలన్నా.. మనందరం జస్ట్‌ భక్తులం. అమ్మోరు ఓసారి కోపగించొచ్చు.. ఒకసారి కనికరించొచ్చు. మనం అలాగ ప్రదక్షిణాలు చేస్తుండటమే’’ అంటున్నారు కిరణ్‌  అబ్బవరం. మరి ఆయన మనసు దోచిన ఆ అందాల దేవత ఎవరు? వారి ప్రేమకథేంటి? తెలియాలంటే ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణమండపం’ చూడాల్సిందే. కిరణ్‌ - ప్రియాంక జవాల్కర్‌ జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీధర్‌ గాదే తెరకెక్కిస్తున్నారు. ప్రమోద్‌, రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చేతన్‌ భరద్వాజ్‌ స్వరాలందించారు. మంగళవారం ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఈ చిత్ర మూడో గీతాన్ని విడుదల చేశారు. ‘‘తిట్టినా బాగుంటాదే.. కొట్టినా బాగుంటాదే’’ అంటూ క్యాచీగా సాగుతున్న ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యమందించగా.. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఈ చిత్రంలో కిరణ్‌ హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించడం విశేషం. ఇందులో సాయికుమార్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. థియేటర్లు తెరచుకోగానే విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నట్లు నిర్మాత తెలియజేశారు. ఈ సినిమాకి ఛాయాగ్రహణం: విశ్వాస్‌ డేనియల్‌.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని