కొత్త జోడీ
close
Published : 23/06/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త జోడీ

ది సాయికుమార్‌ కథా నాయకుడిగా ఎం.వీరభద్రం దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘కిరాతక’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఇందులో ఆది సరసన పాయల్‌ రాజ్‌పూత్‌ నటించనున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘చుట్టాలబ్బాయి’ తర్వాత ఆదితో చేస్తున్న రెండో చిత్రమిది. విభిన్నమైన కథాంశంతో రూపొందుతోంది. స్క్రిప్ట్‌ చక్కగా కుదిరింది. సురేష్‌ సంగీతం, రామ్‌ ఛాయా గ్రహణం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. ‘‘కథకు తగ్గట్లుగానే ‘కిరాతక’ అనే టైటిల్‌ ఖరారు చేశాం. దర్శకుడు వీరభద్రం చెప్పిన కథ వైవిధ్యభరితంగా ఉంది. అతి త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తామ’’న్నారు నిర్మాత. ఈ సినిమాకి సంగీతం: సురేష్‌ బొబ్బిలి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని