ఓటీటీలో ‘మాస్ట్రో’?
close
Published : 23/06/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీలో ‘మాస్ట్రో’?

నితిన్‌, నభా నటేష్‌ జంటగా మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మాస్ట్రో’. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకొంటున్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ, శాటిలైట్‌, థియేట్రికల్‌ హక్కుల కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ చిత్ర బృందంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. అంతేకాదు అన్ని హక్కుల కొనుగోలు కోసం భారీ మొత్తం ఇచ్చేందుకు సిద్ధమైందని సమాచారం. ప్రస్తుతం ఈ విషయంపై చిత్ర బృందం సదరు ఓటీటీ సంస్థతో చర్చలు జరుపుతోంది. ఆగస్టు నాటికి థియేటర్లు గాడిన పడినట్లయితే థియేటర్లలోకి తీసుకురావాలని, లేదంటే ఓటీటీకి తీసుకెళ్లాలని ప్రణాళిక రచిస్తున్నారు. ఏదైనా జులైలో పరిస్థితుల్ని బట్టి తుది నిర్ణయం తీసుకునే  అవకాశమున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‌లో విజయవంతమైన ‘అంధాదూన్‌’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఇందులో నితిన్‌ అంధుడైన పియానో ప్లేయర్‌గా కనిపించనున్నారు. తమన్నా ప్రతి నాయిక ఛాయలున్న పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్‌, ఛాయాగ్రహణం: యువరాజ్‌.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని