రయ్‌..రయ్‌.. సింగరాయ్‌
close
Published : 23/06/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రయ్‌..రయ్‌.. సింగరాయ్‌

నాని కథానాయకుడిగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్‌ కథానాయికలు. ఇప్పటికే 75శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈనెలాఖరు నుంచి కొత్త షెడ్యూల్‌ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వేసిన కోల్‌కతా నగర సెట్‌లో చిత్రీకరణ కొనసాగించనున్నారు. ఇందుకు తగ్గట్లుగా ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ షెడ్యూల్‌లో నానితో పాటు మిగిలిన ప్రధాన తారాగణమంతా పాల్గొననున్నట్లు చిత్ర సన్నిహిత వర్గాల తెలియ జేశాయి. ఓ విభిన్నమైన సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. పునర్జన్మల అంశంతో పాటు పలు థ్రిల్లింగ్‌ విషయాలు ఈ కథలో ఉన్నాయని సమాచారం. దీనికి తగ్గట్లుగానే నాని ఇందులో విభిన్న గెటప్పుల్లో సందడి చేయనున్నారు. ఈ సినిమాకి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: సను జాన్‌ వర్గీస్‌.

‘టక్‌ జగదీష్‌’ ముస్తాబు..: నాని హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘టక్‌ జగదీష్‌’. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించారు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడిన ఈ చిత్రం.. ప్రస్తుతం విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే డబ్బింగ్‌ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ మిక్సింగ్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని