నాగచైతన్య కసరత్తులు
close
Updated : 24/06/2021 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాగచైతన్య కసరత్తులు

నాగచైతన్య హిందీ చిత్రం కోసం కసరత్తులు మొదలుపెట్టారు. ఈసారి కండలు పెంచి మరింత దృఢంగా ఆయన తెరపై కనిపించనున్నారు. హిందీలో ఆమిర్‌ఖాన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నారు చైతూ. అందులోని పాత్ర కోసమే ఆయన నిపుణుల పర్యవేక్షణలో జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. బరువులు ఎత్తుతూ, చెమటోడుస్తున్నప్పటి వీడియో సామాజిక మాధ్యమాల్లో కనిపించింది. ఈ చిత్రంలో చైతూ ఆర్మీ అధికారి పాత్రలో సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ‘లాల్‌ సింగ్‌ చద్దా’ కోసం రంగంలోకి దిగనున్నారు. ఆయన ప్రస్తుతం ‘థ్యాంక్‌ యూ’ చిత్రంలో నటిస్తున్నారు. ‘లవ్‌స్టోరి’ విడుదలకి సిద్ధంగా ఉంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని