చిరుకు జోడీగా
close
Updated : 24/06/2021 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరుకు జోడీగా

జనీకాంత్‌... సల్మాన్‌ఖాన్‌ తదితర అగ్ర కథానాయకులతో కలిసి ఆడిపాడింది బాలీవుడ్‌ నాయిక సోనాక్షి సిన్హా. ఆమె త్వరలో చిరంజీవితోనూ కలిసి జోడీ కట్టేందుకు సిద్ధమవుతోంది. చిరంజీవి కథానాయకుడిగా బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. చిరు 154వ చిత్రంగా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఇప్పటికే చిరు కథ విని పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. స్క్రిప్టు పనులు పూర్తి కావడంతో చిత్రబృందం నాయిక ఎంపికపై దృష్టి సారించింది. బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హాని సంప్రదించగా, ఆమె ఓకే చెప్పేసినట్టు సమాచారం.
చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’లో నటిస్తున్నారు. ఆ తర్వాత ‘లూసిఫర్‌’ రీమేక్‌ కోసం రంగంలోకి దిగుతారు. అది పూర్తయ్యాక బాబీ దర్శకత్వం వహించనున్న సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ‘వెంకీమామ’ తర్వాత బాబీ చేస్తున్న సినిమా ఇదే.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని