వెంకటేష్‌.. టీజర్‌ ట్రీట్‌?
close
Published : 24/06/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెంకటేష్‌.. టీజర్‌ ట్రీట్‌?

వెంకటేష్‌ కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘నారప్ప’. డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయిక. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం ఈ చిత్ర టీజర్‌ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే తేదీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టీజర్‌ విడుదల సందర్భంగానే చిత్ర విడుదల తేదీపైనా ఓ స్పష్టత ఇచ్చే అవకాశముంది. తమిళంలో విజయవంతమైన ‘అసురన్‌’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఇందులో వెంకటేష్‌ రెండు భిన్నమైన లుక్‌లలో కనిపించనున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని