Pooja hegde: పాట కోసం ప్రత్యేకంగా
close
Updated : 27/06/2021 06:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pooja hegde: పాట కోసం ప్రత్యేకంగా

‘ఇక విరామం లేదు.. చిత్రీకరణలతో చూపిస్తా జోరు’ అంటూ వరుస   సినిమాలతో సెట్స్‌పై సందడి చేస్తోంది నటి పూజా హెగ్డే. ఇప్పటికే ఆమె ‘రాధేశ్యామ్‌’ ఆఖరి షెడ్యూల్‌ కోసం సెట్స్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరపుకొంటోంది. ఈ వారంలోనే పూజా పాత్ర చిత్రీకరణ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆమె విజయ్‌ దళపతి ‘బీస్ట్‌’ కోసం రంగంలోకి దిగనుంది. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం తుది   దశ చిత్రీకరణలో ఉంది. జులై 1 నుంచి కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో భాగంగా పూజా, విజయ్‌లపై ఓ పాట చిత్రీకరించనున్నారు. దీని కోసమే పూజా హెగ్డే డ్యాన్స్‌ సాధన ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంటూ.. ‘బీస్ట్‌’ కోసం సిద్ధమవుతున్నట్లు తెలియజేసింది. దాదాపు పదేళ్ల విరామం తర్వాత పూజా తమిళంలో చేస్తున్న రెండో సినిమా ఇది. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెర  కెక్కుతోంది. మలయాళ నటి అపర్ణదాస్‌ కీలక పాత్రలో నటిస్తోంది. అనిరుధ్‌ స్వరాలందిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని