Srikanth: దేవుడు నచ్చాడు 
close
Updated : 29/06/2021 05:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Srikanth: దేవుడు నచ్చాడు 

‘‘తెలంగాణ ఉద్యమం గురించి చాలా బాగా చూపించారు. ఉద్యమం సమయంలో ఎవరెవరు ఎలా కష్టపడ్డారనే విషయాలతో కూడిన సన్నివేశాలు ఎంతగానో నచ్చాయి’’ అన్నారు తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘తెలంగాణ దేవుడు’ చిత్ర ప్రదర్శనకి ఆయన హాజరయ్యారు. శ్రీకాంత్‌ ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రమిది. జిసాన్‌ ఉస్మాన్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. వడత్య హరీష్‌ దర్శకత్వంలో, మహ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మించారు. 1969 నుంచి తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితుల్ని చూసి చలించి... 2014 వరకు ఉద్యమాన్ని ముందుకు నడిపించి ప్రజల కష్టాల్ని, వారి కోరికని నెరవేర్చిన ఓ నాయకుడి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం మంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ ఉద్యమ సన్నివేశాలు మనసుల్ని హత్తుకునేలా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్‌తో పాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని