Maa election: పెద్దలు చెబితే ఎన్నికల నుంచి తప్పుకుంటా
close
Updated : 13/07/2021 06:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Maa election: పెద్దలు చెబితే ఎన్నికల నుంచి తప్పుకుంటా

‘‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఒక కుటుంబం. అందులో 900 మంది ఉన్నారు. పెద్దలంతా కలిసి ఎవరినైనా ఒక్కరిని నిలబెట్టి అధ్యక్షుడు ఇతనే అని చెబితే ఎన్నికల నుంచి తప్పుకుంటాను. వాళ్లందరూ ఏకగ్రీవంగా ఎవరినీ ఎన్నుకోలేకపోతే నేను పోటీకి సిద్ధం. పెద్దల్ని గౌరవిస్తాను, వాళ్ల సలహాలు తీసుకుంటా’’ అన్నారు కథానాయకుడు మంచు విష్ణు. ఆయన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘మా’ గురించి, ఎన్నికల గురించి ఆయన తన మనసులో మాటని ఓ వీడియో రూపంలో విడుదల చేశారు. పదవుల్లో ఉన్నా లేకపోయినా పరిశ్రమలో
ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను గానీ, నా కుటుంబంగానీ అండగా నిలుస్తూనే ఉందని చెప్పారు విష్ణు. ప్రతి ఎన్నికల్లోనూ ‘మా’ భవనమే ప్రధాన అజెండాగా మారుతోందనీ, అందుకే ‘మా’ భవనం కోసం ఖర్చయ్యే ప్రతి పైసా నేనే ఇస్తాననీ, నా కుటుంబంతో కలిసి భవనాన్ని నిర్మిస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇక నుంచి మన నటులకి ఎదురవుతున్న అసలైన సమస్యల మీదే దృష్టిపెట్టాలన్నారు. ‘‘ఇంతకుముందు అధ్యక్షులంతా ‘మా’ కోసం నిస్వార్థంగా పనిచేశారు. ఏవైనా చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు కానీ అవి ఉద్దేశ్యపూర్వకంగా చేసినవి కావని అనుకుంటున్నా. గతాన్ని తవ్వుకోకుండా మంచి పనులు ఎలా చేయాలో ఆలోచిద్దాం. సినిమాల్లో నటిస్తున్న అందరినీ సభ్యులుగా చేయాలి. ‘మా’ కుటుంబాన్ని మరింతగా విస్తరించి ప్రతి నిర్మాణ సంస్థకీ, ఓటీటీ వేదికకీ పంపి మన సభ్యులకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరాలి. ‘మా’ బలపడాలి, నిర్మాతలకి సహకరించాలి’’ అన్నారు విష్ణు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని