‘పొన్నియిన్‌ సెల్వన్‌ - 1’ వచ్చే ఏడాది
close
Updated : 20/07/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పొన్నియిన్‌ సెల్వన్‌ - 1’ వచ్చే ఏడాది

‘‘స్వర్ణ యుగం తిరిగి ప్రాణం పోసుకుంటోంది’’ అంటున్నారు దర్శకుడు మణిరత్నం. ఇప్పుడాయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. కల్కి కృష్ణమూర్తి రచించిన చారిత్రక నవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఆధారంగా రూపొందుతోంది. విక్రమ్‌, కార్తి, ఐశ్వర్య రాయ్‌, త్రిష, కీర్తి సురేష్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. దీనికి సంబంధించి కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఈ పోస్టర్‌లో పులి బొమ్మతో కూడిన స్వర్ణ ఖడ్గం, డాలుని చూపించారు. చోళుల కాలం నాటి కథతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పాండిచ్చేరిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాకి సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని