ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా..!
close
Updated : 22/07/2021 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా..!

‘‘కొత్త ప్రతిభని ప్రోత్సహించడం... కొత్త కథలతో ప్రయాణం చేయడమే మా ఎజెండా’’ అంటున్నారు నిర్మాత కె.నిరంజన్‌రెడ్డి. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఆయన వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. ‘హౌస్‌ అరెస్ట్‌’, ‘బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’ చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ‘హను -మాన్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘మా ప్రయాణం మొదలై ఏడాదే అయ్యింది. అప్పుడే మూడు సినిమాల్ని పూర్తి చేయగలిగాం. మరో మూడు చిత్రాల్ని పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నాం. చిత్ర పరిశ్రమ నుంచి చక్కటి సహకారం అందుతోంది’’ అంటున్నారు నిరంజన్‌రెడ్డి. గురువారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు.

* ‘‘మా సంస్థ ప్రైమ్‌ షో నుంచి వచ్చే ప్రతి సినిమా ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుంది. అలాంటి కథలతోనే మేం సినిమాలు నిర్మిస్తాం. సినీ నిర్మాణమే కాదు, భవిష్యత్తులో ఎగ్జిబిషన్‌ రంగంలోకీ అడుగుపెడతాం. ఓటీటీ వేదికని ఏర్పాటు చేసే ఆలోచనా ఉంది. మాది నల్గొండ జిల్లా, హైదరాబాద్‌లోనే పుట్టిపెరిగా. అమెరికాలో ఐటీ రంగంలో స్థిరపడ్డా’’.
* ‘‘చిన్న పిల్లల నేపథ్యంలో సినిమా వచ్చి చాలా కాలమైంది. అందుకే ‘హౌస్‌ అరెస్ట్‌’ చిత్రాన్ని చేశాం. ‘బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’ అనేది అదో ట్రెండీ కథ. ‘హను -మాన్‌’ సూపర్‌హీరో చిత్రం’’.
* ‘‘అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ప్రేక్షకులు థియేటర్లలో సినిమాల్ని ఆస్వాదించడానికే ఇష్టపడుతున్నారు. మనకు థియేటర్లే కీలకం కానున్నాయి. తెలుగులోనే కాదు, బాలీవుడ్‌, హాలీవుడ్‌లోనూ చిత్రాల్ని నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నాం’’.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని