నాగశౌర్య తమ్ముడు బ్రహ్మాజీ
close
Published : 24/07/2021 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాగశౌర్య తమ్ముడు బ్రహ్మాజీ

నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. షీర్లే సేతియా కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా చిత్ర ప్రధాన తారాగణంపై వినోదాత్మక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఈ సినిమా నుంచి ఓ వర్కింగ్‌ స్టిల్‌ను విడుదల చేశారు నాగశౌర్య. ఈ ఫొటోలో ఆయన బ్రహ్మాజీతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ‘‘నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్‌ తనకి కావాలి. దయచేసి కొత్త ప్రతిభావంతుల్ని ప్రోత్సహించండి’’ అంటూ ఫన్నీగా ఆ ఫొటోకి ఓ వ్యాఖ్యని జత చేశారు శౌర్య. ‘‘కుటుంబ ప్రేక్షకులు మెచ్చే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. నాగశౌర్య పాత్ర చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. నటి రాధిక కీలక పాత్రలో నటిస్తోంది. వెన్నెల కిశోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య కామెడీ ఆకట్టుకుంటుంది’’ అని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్‌, ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్‌.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని