ప్రేమంటేనే అది
close
Published : 24/07/2021 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రేమంటేనే అది

థానాయికల దగ్గర ప్రేమ ప్రస్తావన తీసుకొచ్చామంటే... ‘ప్రేమకి సమయం లేదు, ప్రస్తుతానికి నా కెరీర్‌తోనే ప్రేమలో పడ్డా’ అంటూ తెలివిగా దాటేస్తుంటారు. అగ్ర కథానాయిక పూజాహెగ్డే మాత్రం బోలెడన్ని ప్రేమ కబుర్లు చెబుతోంది. కాకపోతే ఆమె ప్రేమ కోణం వేరు. తన సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రలు చేసినా... పూర్తిస్థాయి ప్రేమకథలో నటించే అవకాశం రాలేదని, ఆ కోరిక మాత్రం ఇటీవలే తీరిందని చెప్పుకొచ్చింది. నిజ జీవితంలో సంగతేమో కానీ, తెరపై ప్రేయసిగా మురిపిస్తుందన్నమాట పూజ. ఇంతకీ ఈమె చేసిన ప్రేమకథ ఏమిటో తెలుసా?... ‘రాధేశ్యామ్‌’. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. తుదిదశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా గురించి ఆత్రుతగా ఎదురు చూస్తోందట పూజా. ‘‘పరిణతితో కూడిన ప్రేమకథ ఇది. ఇలాంటి సినిమా నేను చేయలేద’’ని చెప్పుకొచ్చింది. ప్రేమతో చేసే ఏ పనైనా జీవితాల్ని మార్చగలదని నేను బలంగా నమ్ముతాననని, అసలు ప్రేమంటేనే అదని సెలవిచ్చిందీ సోయగం. దక్షిణాదితోపాటు హిందీలోనూ వరుస అవకాశాలతో దూసుకెళుతున్న కథానాయిక ఈమె.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని