‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో రాజమౌళి మెరుపులు
close
Published : 25/07/2021 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో రాజమౌళి మెరుపులు

ర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తన సినిమాల్లో అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తుంటారు. ‘బాహుబలి’ తొలి భాగంలోని ప్రత్యేకగీతంలో ప్రభాస్‌, రానాతో కలిసి సందడి చేశారు. ‘మగధీర’లోనూ చివరిగా వచ్చే పాటలో ఆయన ఆడిపాడారు. అలా ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లోనూ ఆయన ఓ పాటలో మెరుస్తారని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్న ఓ పాటలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, అలియాభట్‌లతో కలిసి రాజమౌళి కాలు కదుపుతున్నారు. ప్రేమ్‌రక్షిత్‌ నృత్య దర్శకత్వం వహిస్తున్న ఆ పాట చిత్రీకరణ మరో రెండు రోజులపాటు సాగుతుంది. అనంతరం ఉక్రెయిన్‌లో ఓ పాటని తెరకెక్కించనున్నారు. దాంతో చిత్రీకరణ పూర్తవనున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో బాలీవుడ్‌ తారలు అలియాభట్‌, అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఆ పాటల్ని పూర్తి చేసి ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టనుంది చిత్రబృందం. దసరా సందర్భంగా అక్టోబరు 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని