నిలదొక్కుకోవాలంటే.. ప్రయోగాలు చేయాల్సిందే
close
Published : 25/07/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిలదొక్కుకోవాలంటే.. ప్రయోగాలు చేయాల్సిందే

‘‘కొత్త కథల్ని ఎంచుకోవడం.. వాటిని వెతికి పట్టుకోవడం చాలా కష్టమైన పని. ఒకవేళ మనం ఆ కథని నమ్మి, సినిమాకి ఒప్పుకొన్నా.. పెట్టుబడి పెట్టే నిర్మాత దానిపై అంతే నమ్మకం ఉంచాలి కదా. దీంట్లో చాలా సవాళ్లుంటాయి’’ అన్నారు తేజ సజ్జా.
బాలనటుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయన.. ‘జాంబిరెడ్డి’తో కథానాయకుడిగా తెరకు పరిచయమయ్యారు. రెండో చిత్రంగా ‘ఇష్క్‌’ చేశారు. యస్‌.యస్‌.రాజు దర్శకుడు. మెగా సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ సంస్థ నిర్మించింది. ఈనెల 30న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు తేజ సజ్జా.  


 ‘‘సాధారణంగా తెలుగు సినిమాల్లో కథ ఇలా నడవాలి.. నాయకానాయికలంటే ఇలా ఉండాలి అని కొన్ని సూత్రాలుంటాయి కదా. వాటన్నింటినీ బ్రేక్‌ చేసే చిత్రం మా ‘ఇష్క్‌’. ఓ కొత్త రకమైన కథాంశంతో రూపొందింది. ఇది మలయాళ సినిమా ‘ఇష్క్‌’కి రీమేకే అయినా.. మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా స్క్రిప్ట్‌లో చక్కటి మార్పులు చేశాం’’.

 ‘‘జాంబి రెడ్డి’ విడుదల కావడానికి ముందే నేనీ సినిమా ఒప్పుకొన్నా. ‘ఓ బేబీ’ చిత్రంలో నా నటన చూసి.. ఈ కథ నేను మోయగలను అనే నమ్మకంతో నిర్మాతలు నన్ను తీసుకున్నారు. వాస్తవానికి మూడు పెద్ద బ్యానర్లు ఈ రీమేక్‌పై ఆసక్తి చూపించాయి. యాదృచ్ఛికం ఏంటంటే.. ఆ మూడు సంస్థల నిర్మాతలూ హీరోగా నన్నే సంప్రదించారు. ఇది రొమాంటిక్‌ థ్రిల్లరే అయినా.. కుటుంబంతో కలిసి హాయిగా చూడగలిగేలా ఉంటుంది’’.  

*  ‘‘కొత్తగా పరిశ్రమలోకి వస్తున్న నాలాంటి కథానాయకులు నిలదొక్కుకోవాలంటే.. కచ్చితంగా కొత్తరకం కథలు ఎంచుకోవాల్సిందే. ప్రయోగాలు చేయాల్సిందే. ఎందుకంటే చూసే ప్రేక్షకులూ అనుకుంటారు కదా.. ‘ఆ హీరో సినిమాలెందుకు చూడాలి’ అని. ప్రస్తుతం నేనెలాంటి కొత్త కథలు  చూపించాలనుకుంటున్నానో.. అలాంటివే నా వరకు వస్తున్నాయి. దీన్ని ఇలాగే కొనసాగించాలి అనుకుంటున్నా’’.

 ‘‘నేను ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ‘హను-మాన్‌’ చిత్రం చేస్తున్నా. ఐదు భాషల్లో పాన్‌ ఇండియా సినిమాలా ముస్తాబు చేస్తున్నాం. నేనిందులో ‘హను-మాన్‌’ అనే సూపర్‌ హీరోగా కనిపిస్తా. ఇప్పటికే 15రోజుల చిత్రీకరణ పూర్తయింది. అక్టోబరుకల్లా సినిమా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది విడుదలయ్యాకే.. తర్వాతి ప్రాజెక్ట్‌లపై నిర్ణయం తీసుకుంటా’’.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని