గాఢీ ఎక్కిన ‘ఖిలాడి’
close
Published : 25/07/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గాఢీ ఎక్కిన ‘ఖిలాడి’

రెండో దశ కరోనాతో ఆగిపోయిన సినిమాలన్నీ దాదాపు పునఃప్రారంభమయ్యాయి. రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఖిలాడి’ ఈ నెల 26 నుంచి మళ్లీ పట్టాలెక్కనుందని సినీ వర్గాలు తెలిపాయి. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రమిది. ప్లే స్మార్ట్‌... అనేది ఉపశీర్షిక. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలు. రమేష్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మాత. జయంతిలాల్‌ గడ సమర్పిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. కరోనా రెండో దశకి ముందే ఇటలీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. శనివారం కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. అందులో స్పోర్ట్స్‌ బైక్‌పై స్టైలిష్‌గా కనిపిస్తున్నారు రవితేజ. ‘‘రెండు పాత్రల్లో రవితేజ చేయనున్న సందడి అలరిస్తుంద’’ని తెలిపాయి సినీ వర్గాలు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని