నవ్వులు పంచే ‘క్రేజీ అంకుల్స్‌’
close
Published : 26/07/2021 02:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నవ్వులు పంచే ‘క్రేజీ అంకుల్స్‌’

శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ అంకుల్స్‌’. సత్తిబాబు దర్శకుడు. గుడ్‌ ఫ్రెండ్స్‌, శ్రీవాస్‌ 2 క్రియేటివ్స్‌, బొడ్డు అశోక్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రఘు కుంచె స్వరాలందించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా    ఆగస్టులో థియేటర్లలో విడుదల కానుంది.  ఆదివారం హైదరాబాద్‌లో దర్శకుడు అనిల్‌ రావిపూడి టైటిల్‌ గీతాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ.. ‘‘థియేటర్స్‌లో చూడాల్సిన చక్కటి కుటుంబ కథా చిత్రమిది. అందరితో చాలా ఓపికగా పని చేయించుకున్న దర్శక, నిర్మాతలకు నా ధన్యవాదాలు’’ అంది.    ‘‘చిత్ర బృందంలో ప్రతిఒక్కరూ ఎంతో కష్టపడి సినిమా చేశారు. శ్రీముఖి భవిష్యత్తులో పెద్ద నటి కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు రాజా రవీంద్ర. దర్శకుడు శ్రీవాస్‌ మాట్లాడుతూ.. ‘‘వినోదాత్మక చిత్రాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ చిత్రం అనుకున్నాం. ముగ్గురు అంకుల్స్‌, ముగ్గురు ఆంటీలు చేసిన కథే ఈ సినిమా. ఎక్కడా అసభ్యతకు తావుండదు. వినోదాత్మకంగా సాగుతుంది. మంచి అవుట్‌పుట్‌ ఇచ్చిన దర్శకుడు సత్తిబాబుకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ఈ సినిమాని మేలో విడుదల చేద్దామనుకున్నాం. కరోనా వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు ఆగస్టులో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మా మరో సినిమా ‘గోల్డ్‌మ్యాన్‌’ సెప్టెంబరులో విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాతలు బొడ్డు అశోక్‌, శ్రేయాస్‌ శ్రీనివాస్‌. ఈ కార్యక్రమంలో శ్రీధర్‌ రావు,  లక్ష్మణరావు, డార్లింగ్‌ సామీ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని