ఎవరీ బచ్చన్‌సాబ్‌?
close
Published : 26/07/2021 02:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎవరీ బచ్చన్‌సాబ్‌?

ర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరి... బచ్చన్‌సాబ్‌గా సందడి చేయనున్నాడు. మరి ఈ బచ్చన్‌ సాబ్‌ ఎవరు? అతని కథేమిటో తెలియాలంటే ‘చోర్‌ బజార్‌’ సినిమా చూడాల్సిందే. జీవన్‌రెడ్డి  దర్శకత్వంలో ఆకాష్‌ పూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. ఐ.వి.ప్రొడక్షన్స్‌ పతాకంపై వి.ఎస్‌.రాజు నిర్మిస్తున్నారు. ఆకాష్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని, మోషన్‌ పోస్టర్‌ని ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం. చేతిపై బచ్చన్‌ సాబ్‌ అనే పచ్చబొట్టుతో, మాస్‌ లుక్‌తో సందడి చేశాడు ఆకాష్‌. ప్రస్తుతం హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. గెహనాసిప్పీతో పాటు ఇతర తారాగణం నటిస్తున్న ఈ సినిమాకి ఛాయాగ్రహణం: జగదీష్‌ చీకటి, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, కళ: గాంధీ నడికుడికర్‌, కూర్పు: అన్వర్‌ అలీ.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని